ఢిల్లీ టూర్ లో సీఎం రేవంత్ బిజీ
NEWS Mar 04,2025 09:43 am
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సీఎంగా కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు 37 సార్లు ఢిల్లీకి వెళ్లారు. గతంలో ఏ సీఎం ఇలా వెళ్లిన దాఖలాలు లేవు. నిన్న కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో కలిసన సీఎం ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో భేటీ కానున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ది పనులపై చర్చించనున్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు ఫేస్2, రీజనల్ రింగ్, రోడ్, రీజినల్ రింగ్ రైల్వే వంటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరనున్నారు.