వల్లభనేని వంశీపై మరో కేసు
NEWS Mar 04,2025 09:33 am
టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే పలు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయన పై మరో కేసు నమోదైంది. బ్రహ్మలింగయ్య చెరువు అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదు రావడంతో వంశీతో పాటు ఆయన అనుచరులు లక్ష్మణ రావు, రంగా, శేషు, రవి, పరంధామయ్యపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తను విజయవాడ సబ్ జైలులో ఉన్నారు.