శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు
NEWS Mar 04,2025 09:04 am
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 683 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 453 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.