జిల్లాస్థాయిలో సత్తా చాటిన విద్యార్థికి సన్మానం
NEWS Mar 03,2025 11:16 pm
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో జగిత్యాల జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని మంగిలపల్లిని ప్రిన్సిపల్ వెంకయ్య, సిబ్బంది సన్మానించారు. శాలువాతో సత్కరించి భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దేవన్న, రాజేందర్, మనోజ్ కుమార్, గట్టయ్య, అంజయ్య, శ్రీకాంత్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.