జహీరాబాద్: కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించడంతో జహీరాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు బీజేపీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ ఆధ్వర్యంలో స్వీట్లు తినిపించుకొని సోమవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నమ్మకంతో అభ్యర్థిని గెలిపించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.