అప్రమత్తంతోనే సైబర్ నేరాలు అడ్డుకట్ట
NEWS Mar 03,2025 11:24 pm
సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మెట్‌పల్లి డీఎస్పి రాములు సూచించారు. పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. కొత్త నెంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్ ఏపికె మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి తెలిపారు. పోలీస్ యూనిఫామ్ తో ఎవరైనా వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే స్పందించవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయాలని సూచించారు.