MBNR: ప్రజావాణి కొచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.