మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కుటుంబ సభ్యులతో కలిశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. త్వరలోనే ఆయన జనసేన లో చేరుతున్నట్లు సమాచారం. తన చేరికకు సంబంధించి పవన్ లైన్ క్లియర్ చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి కూడా భారీ ఎత్తున నేతలు పవన్ ఆధ్వర్యంలో చేరనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.