సంగారెడ్డి:మున్సిపల్ కార్యాలయం ముందు నారాయణరెడ్డి కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం విన్నుతంగా ధర్నా నిర్వహించారు. కాలనీలో బోరు మోటర్ పాడు కావడంతో మూడు నెలల నుంచి మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు ఆరోపించారు. బోరుకు మరమ్మత్తులు చేయించి మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు.