మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు తన నోటి దూలను తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. తాను అచ్చెన్న కలిసి ఒకే ప్రాంతం నుంచి వచ్చామన్నారు. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం తనకు ఉందని ఆయనకు తెలుసన్నారు. గాలికి మేం వచ్చాం అని మంత్రి చేసిన అభ్యంతర వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలన్నారు. తాము ఎవరినీ కించ పరిచేలా మాట్లాడ లేదన్నారు బొత్స. రాజకీయంగా పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.