నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
NEWS Mar 03,2025 04:21 pm
మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎలాంటి చర్చకైనా, ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. 11 కిలోమీటర్లకు పైగా తవ్వామన్నారు. తాను చేసింది తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నానని తెలిపారు. గతంలోనూ చిల్లర మాటలు మాట్లాడారని, పాలన చేతకాక ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.