ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వండి
NEWS Mar 03,2025 02:47 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, కూనమనేని సాంబశివ రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో తమకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. ఎన్నికల పొత్తులో భాగంగా ఒక ఎమ్మె్ల్యే, 2 ఎమ్మెల్సీలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం ఇవ్వలేదని, ఇప్పుడైనా ఎమ్మెల్యేల కోటా కింద కేటాయించాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు.