జక్రాన్ పల్లి వద్ద ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలి
NEWS Mar 03,2025 02:16 pm
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలనీ కోరుతూ కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలిసి విన్నవించారు. హైదరబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడులను మర్యాద పూర్వకంగా కలిశారు. జక్రాన్ పల్లిలో నూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలని, గతంలో పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర మంత్రులను ఎమ్మెల్యే కోరారు.