పోసాని కృష్ణ మురళికి పిటీ వారెంట్
NEWS Mar 03,2025 12:17 pm
నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో ఉన్న తనకు నరసరావుపేట పోలీసులు పిటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఐ హైమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించారు. నరసారావుపేట కోర్టులో హాజరు పర్చనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసానిపై 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసు నమోదు చేశారు.