గంజాయి నిర్మూలన కోసం ఈగల్ వ్యవస్థ
NEWS Mar 03,2025 12:03 pm
గత వైసీపీ ప్రభుత్వ మయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు మంత్రి వంగలపూడి అనిత. తమ కూటమి సర్కార్ వచ్చాక ఉక్కుపాదం మోపామన్నారు. ఎక్కడ కూడా సాగు, రవాణా చేయకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందు కోసం జీవోను తీసుకు వచ్చామని, ఐజీ స్థాయి అధికారికి ఈగల్ కు చీఫ్ గా నియమించామన్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేపట్టామని తెలిపారు.