రాష్ట్రానికి అడ్డంకి మోదీ కాదు కిషన్ రెడ్డి
NEWS Mar 03,2025 10:11 am
సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మరోసారి ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి విలన్ పీఎం మోదీ కాదని కేంద్ర మంత్రేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. తను తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారని, ప్రాజెక్టులు, పనులకు అడ్డు తగులుతున్నాడని మండిపడ్డారు. పీఎం సానుకూలంగా ఉన్నా తను కావాలని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మెట్రో విస్తరణ పనులకు నిధులు ఇవ్వకుండా అడ్డు పుల్ల వేశాడని ధ్వజమెత్తారు సీఎం.