మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రానికి ఏదో ఒక రోజు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తనకు అన్ని విధాలుగా అర్హతలు , అనుభవం ఉందన్నారు. అయితే ముఖ్యమంత్రి పీఠం మీద ఎప్పుడు కూర్చుంటారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇదిలా ఉండగా వీరప్ప మొయిలీ చేసిన తాజా కామెంట్స్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం సీఎంగా సిద్దరామయ్య ఉన్నారు.