కేసీఆర్ సందేశ్ పేరుతో సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తన భార్యతో కలిసి సుబ్బారావు ఫామ్ హౌస్ లో ఉన్న పార్టీ బాస్ కేసీఆర్ ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అనంతరం పార్టీ తరపున రూ. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.