MBNR:చిన్నచింతకుంట మండలంలోని వడ్డేమాన్కు చెందిన గర్భిణి సామనజీయ (25)ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కాన్పు కోసం తెల్లవారు జామున మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ లక్ష్మణ్, పైలెట్ బాలకృష్ణ డాక్టర్ సలహా మేరకు సాధారణ ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.