ఎస్ఎల్బీసీ ఘటనలో మృతి చెందిన కార్మికులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పదేళ్లలో 2 కిలోమీటర్లు కూడా టన్నెల్ తవ్వలేదన్నారు.. నిపుణులతో చర్చించాకే మళ్లీ ప్రాజెక్టు పనులు ప్రారంభించామన్నారు. పనులు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగిందన్నారు. దీనిని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర సంస్థలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయని చెప్పారు. ఆపరేషన్ పూర్తయ్యేందుకు ఇంకా మూడు రోజులు పడుతుందన్నారు.