జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర నెంబర్ వన్
NEWS Mar 02,2025 06:15 pm
కేంద్ర సర్కార్ గత నెల ఫిబ్రవరికి సంబంధించి జీఎస్టీ వివరాలను ప్రకటించింది. అత్యధికంగా రూ. 30, 637 కోట్లతో మహారాష్ట్ర టాప్ లో నిలువగా అత్యల్పంగా మిజోరం కేవలం రూ. 42 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తెలిపింది. తెలంగాణ నుంచి రూ. 5,280 కోట్లు వసూలు కాగా, ఏపీ నుంచి రూ. 3,817 కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది.