వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన చదువుకునే రోజుల్లో వనపర్తిలో పార్వతమ్మ ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉంది. ఇవాళ టూర్ లో భాగంగా పార్వతమ్మ ఇంటికి వెళ్లారు. సీఎంకు హారతి పట్టి ప్రేమతో సాదరంగా ఆహ్వానించారు. ఎన్నాళ్లయింది చూసి అంటూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు రేవంత్ రెడ్డి.