కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంత రావు నివాసంలో మున్నూరు కాపు నేతలు సమావేశం కావడం పట్ల సీరియస్ అయ్యారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రతిపక్షాలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏమిటంటూ ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తే ఎలా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను ఎందుకు పిలిచారని మండిపడ్డారు.