అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత
NEWS Mar 02,2025 04:07 pm
మెట్‌పల్లి: మల్లాపూర్ మండలం సాతారం గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా రెవెన్యూ, పోలీస్ శాఖల సంయుక్త తనిఖీల్లో భాగంగా వేంపేట శివారులో ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అనుమతి లేకుండా ఇసుకను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా డ్రైవర్ రాంబాబు, ట్రాక్టర్ యజమాని రోహిత్‌లను అధికారులు పట్టుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు. ఎంఆర్ఓకు నివేదిక పంపినట్లు తెలిపారు.