కోరుట్ల మండలం ఎకిన్ పూర్ గ్రామానికి చెందిన దేవుడి నర్సారెడ్డి (55) వేంపల్లి వెళ్లే మార్గంలో వేంపేట శివారులో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తలపై తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య అనసూయ తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాదు తరలించారు. బస్సు డ్రైవర్ రాకేష్ పరారీలో ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు CI నిరంజన్ రెడ్డి తెలిపారు.