రామడుగు మండలం వన్నారం గ్రామంలో ప్రేమించిన యువతీతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి తల్లి పై యువకుడు హత్యా యత్నానికి పాల్పడ్డాడు. రాజ్ కుమార్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు. దీనిని గమనించిన యువతి తల్లి వేరే వ్యక్తితో పెళ్లి కుదిర్చింది. విషయం తెలుసుకున్న యువకుడు తనను గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. గ్రామస్థులు యువకుడికి దేహశుద్ది చేశారు. తల్లిని కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.