డీఐజీ సునీల్ నాయక్ కు బిగ్ షాక్ తగిలింది. ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ డీఐజీకి నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ స్పీకర్ ను సీఐడీ ఆఫీసుకు తీసుకు వచ్చిన సమయంలో సునీల్ నాయక్ కూడా వచ్చారని ధ్రువీకరించారు. ఈ మేరకు ఈ కేసులో తనను కూడా విచారించాలని నిర్ణయించామన్నారు. ఇదిలా ఉండగా జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ డీఐజీగా ఉన్నారు. ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా పని చేస్తున్నారు.