కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ లో పాల్గొనే అధికారులకు ఆదివారం మాకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లే ముందు అధికారులను పోలీసులు పూర్తిగా తనిఖీ లోపలికి పంపిస్తున్నారు. మొబైల్ ఫోన్ సైతం లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. పూర్తి బందోబస్తు నడుమ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.