ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది. ప్రముఖ తమిళ సినీ నటి మీనాక్షి చౌదరికి కీలక పదవి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమిస్తున్నట్లు వెల్లడించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.