మహిళలకు ఖుష్ కబర్ చెప్పేందుకు సిద్దమైంది రేవంత్ రెడ్డి సర్కార్. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు మంత్రి దాసరి సీతక్క ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ప్రత్యేకించి మహిళల కోసం కొత్త పథకాలను ప్రకటించాలని నిర్ణయించారు. దేశంలో అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామని చెప్పారు.