పోసాని కృష్ణ మురళి డిశ్చార్జ్
NEWS Mar 01,2025 09:06 pm
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నటుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని రిమ్స్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందుకే డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా భువనేశ్వరి, నారా లోకేష్ లపై నోరు పారేసుకున్నారంటూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా తనపై 14 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టు తనకు 14 రోజుల రిమాండ్ విధించింది.