పండ్లు ..నోట్ పుస్తకాలు పంపిణీ
NEWS Mar 02,2025 10:54 am
కామారెడ్డి నియోజకవర్గం పాల్వంచ మండల్ గ్రామం భవానీపేట గ్రామం లోని అనాధ ఆశ్రమం లో జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పుట్టినరోజు సందర్బంగా పండ్లు, నోట్ బుక్స్,పెన్నులు వితరణ చేయడం జరిగింది.వీరశైవ లింగాయత్ మండల అధ్యక్షుడు మామిండ్ల రాజు మాట్లాడారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డికి పిల్లలంటే ప్రాణమని అన్నారు. వారు చదువుకోవాలని సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు.