ఈనెల 3న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టీచర్స్ ఓట్ల కోసం మొత్తం 14 టేబుల్లు సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రోఅబ్సర్వర్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.