కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి వరంగల్ జిల్లాకు ఎయిర్ పోర్ట్ ను తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు జిల్లా నేతలు. ఇవాళ ఆయన నివాసంలో కలిసి సన్మానం చేశారు. మామునూరు కేంద్రంగా ఎయిర్ పోర్ట్ రానుంది. ఇందు కోసం కేంద్రం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే ప్రభుత్వం రూ. 205 కోట్లు మంజూరు చేసింది.