నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో చోటు చేసుకున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో కనిపించకుండా పోయిన ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారని ధ్రువీకరించారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరం సాయంతో మూడు మీటర్ల లోతులో మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించిందన్నారు. మృత దేహాలను వెలికి తీసిన వెంటనే పోస్టుమార్టం చేస్తామన్నారు.