పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత
NEWS Mar 01,2025 03:11 pm
నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సబ్ జైలులో ఉన్న ఆయనను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, భువనేశ్వరిలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. గచ్చిబౌలిలో ఉన్న తనను రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు.