నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష
NEWS Mar 01,2025 02:11 pm
నేరం జరిగిన 100 రోజుల్లోనే శిక్ష పడేలా చేస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత. ప్రజలు, పోలీసుల భాగస్వామ్యంతో లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. సివిల్ ఇండోర్, అవుట్ డోర్ విభాగాల శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఎస్సైలను మెడల్, సర్టిఫికెట్, చీఫ్ మినిస్టర్ పిస్టల్ తో సత్కరించారు. ఏపీఎస్పీ విభాగాల్లోని ఇండోర్, అవుట్ డోర్, ఫైరింగ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరచిన ఎస్సైలను అభినందించారు. ప్రజల భద్రత విషయంలో పోలీసుల పాత్ర వెల కట్టలేనిదన్నారు. 394 మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకోవడం హోంశాఖకు అదనపు బలం చేకూరుతుందన్నారు.