కిషన్ రెడ్డి వల్లనే మెట్రో ఆగింది
NEWS Mar 01,2025 11:26 am
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తెలంగాణకు చెందిన వాడైనా ఈ రాష్ట్రం పట్ల, ఈ ప్రాంతపు ప్రజల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. మెట్రో విస్తరణకు కావాలని అడ్డు పడుతుండడం వల్లనే తమకు నిధులు మంజూరు కావడం లేదన్నారు. మరో వైపు ఇతర రాష్ట్రాలకు మెట్రో విస్తరణ పనులు చేపట్టేందుకు లైన్ క్లియర్ ఇచ్చారని, తెలంగాణకు మొండి చేయి చూపించారని మండిపడ్డారు.