శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు
NEWS Mar 01,2025 11:21 am
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను 52 వేల 731 మంది భక్తులు దర్శించుకున్నారు. 17 వేల 664 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.