కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కందారి చిన్నజీవన్ రెడ్డి కుమారుడు శ్రీయాన్స్ (3) శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో రెండు కుక్కలు దాడి చేయడంతో మెడభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వాటిని తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కోరుట్ల హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు.