సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఒకరు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడితే మరొకరు తెలంగాణ పేరుతో జనాన్ని నట్టేట ముంచారని నిప్పులు చెరిగారు సీఎం. తాము వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజా పాలన అందజేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని అన్నారు.