బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన జరుగుతుందన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తూ సమస్యలపై స్పందించడం బిజెపి విధానం అన్నారు.