అద్దె రూములో జరిగిన ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. గల్ఫ్ కార్మికుల సమాచారం మేరకు కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హనుమంతు సౌదీలోని జుబెల్ లో పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ఇద్దరు రూమ్మేట్స్ మధ్య తలెత్తిన వివాదం హనుమంతు ప్రాణాన్ని బలిగొంది. హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.