మీసేవ సెంటర్ పై విజిలెన్స్ దాడులు
NEWS Feb 28,2025 11:56 pm
కరీంనగర్ నగరపాలక పరిధిలోని దుర్షేడులో శ్రీరామ మీసేవపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ పై ప్రత్యేకంగా అధికారులు దర్యాప్తు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి నగదు చెల్లించకుండా, క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుపుతున్నారని అడిగినట్లు మీసేవ యజమాని అశోక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కూడా దాడులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు.వివిధ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల కాపీలు, వచ్చిన కస్టమర్ల నుంచి వివరాలను అధికారులు సేకరించారు.