కిషన్ రెడ్డికి సీఎం బహిరంగ లేఖ
NEWS Feb 28,2025 03:47 pm
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 9 పేజీల లేఖలో నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి కావాలని తెలంగాణపై కక్ష కట్టారని ఆరోపించారు. తాము చేసిన అభ్యర్థనలను పట్టించు కోవడం లేదని వాపోయారు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. మెట్రో ఫేజ్-2కు రూ.24,269 కోట్లు, ఆర్ఆర్ఆర్ కోసం రూ.34,367 కోట్లు, మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు అడిగినా ఇవ్వ లేదన్నారు. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.