కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్మన్ గా తుహిన్ కాంత పాండేను నియమించింది. ప్రస్తుతం సెబీ చైర్ పర్సన్ మాదిబి పూరి బుచ్ నుండి పాండే బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక కార్యదర్శిగా పని చేస్తున్న తుహిన్ కాంత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి మూడేళ్ల కాలానికి కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆర్థిక లావాదేవీలకు కేరాఫ్ గా సెబీ ఉంటోంది. ఆయన నియామకం మరింత సంస్థను బలోపేతం చేస్తుందన్నారు మోదీ.