పోలింగ్ సిబ్బంది బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరగగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శుక్రవారం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బైంసా పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను బైంసా ఆర్టీసీ డిపోకు చెందిన రెండు బస్సులు కరీంనగర్ స్ట్రాంగ్ రూమ్ తీసుకువచ్చి తిరుగు ప్రయాణంలో కరీంనగర్ జిల్లా గంగాధర శివారు రైల్వే గేట్ సమీపంలో ముందు వెళ్తున్న బస్సు సడన్గా బ్రేక్ చేయడంతో వెనుక బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 19 మంది పోలింగ్ సిబ్బందికి గాయాలు అయ్యాయి.