పోసాని కృష్ణమురళి కి 14 రోజుల రిమాండ్
NEWS Feb 28,2025 10:33 am
నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ ముగిసింది. తను విచారణకు సహకరించ లేదని అనంతపురం జిల్లా పోలీసులు వెల్లడించారు. రాత్రి 9.30 గంటలకు కోర్టులో విచారణ ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు వాదనలు కొనసాగాయి. కోర్టు న్యాయమూర్తి కీలక తీర్పు చెప్పారు. పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , భువనేశ్వరి, లోకేష్ లపై అనుచిత కామెంట్స్ చేశారని రాష్ట్రంలో 14 చోట్ల కేసులు నమోదయ్యాయి.