ప్రతి ఏటా సామాజిక న్యాయ దినోత్సవం
NEWS Feb 28,2025 09:35 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎస్ శాంతి కుమారి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అవార్డులు, సంక్షేమ శిబిరాలు, ప్రజా సంభాషణలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు సీఎస్.