సినీ రంగానికి చెందిన తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్ కు బిగ్ షాక్ తగిలింది. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి ఇద్దరు నటీమణులను పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారికి సమాచారం కూడా ఇచ్చినట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే భారీ ఎత్తున లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. వీరిని నమ్మిన జనం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి మోసానికి గురైనట్లు విచారణలో తేలింది.